సాయుధ పోరాటంపై వక్రీకరణలు..

Distortions on armed struggle..–  పోతినేని సుదర్శన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సాయుధ రైతాంగ పోరాట చరిత్రను కొందరు వక్రీకరిస్తున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ తెలిపారు. ఆ సంఘం ఆధ్వర్యంలో ‘ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం త్యాగాలు’ అనే అంశంపై ఆదివారం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ అధ్యక్షతన వెబినార్‌ నిర్వహించారు. ఆ సందర్భంగా సుదర్శన్‌ మాట్లాడుతూ.. సాయుధ పోరాటాన్ని మత దృక్కోణం నుంచి చరిత్రను చూపించేందుకు మతతత్వ వాదులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సమాజం పురోగమిస్తున్న కొద్దీ మతమౌఢ్యం , అశాస్త్రీయ భావాలు బలహీనపడి ఆధునిక , పురోగామి భావాలు విస్తరించాలన్నారు. కానీ పాలకవర్గాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అశాస్త్రీయ భావాలు, మతమౌఢ్యాన్ని పెంచి పోషిస్తున్నారని వివరించారు. విమోచన దినం పేరుతో బీజేపీి ప్రచారం చేయడం అందులో భాగమేనన్నారు. నిజాం సర్కార్‌ వ్యతిరేక ఉద్యమంలో బీజేపీ కి ఎలాంటి పాత్రా లేదని చెప్పారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ, భూస్వామ్య పీడన నుంచి విముక్తి కోసం ఆనాడు ప్రజలు పోరాడారని వివరించారు.