లొంక కేసారంలో అయోధ్య రామయ్య అక్షింతలు పంపిణీ 

నవతెలంగాణ-రామగిరి
రామగిరి మండలం లొంక కేసారం గ్రామానికి అయోధ్య రామ మందిరం నుంచి తీసుకువచ్చిన రాములవారి అక్షింతలు సర్పంచ్ ఎండి మంజూర్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి కల్వచర్ల వేణుగోపాల స్వామి ఆలయం నుండి లోంక కేసారం గ్రామంలోని హనుమాన్ ఆలయం వరకు శోభయాత్ర గా వెళ్లి,హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఇంటింటికి పంపిణీ చేశారు.ఎండి మంజూర్ సర్పంచ్ గా లొంక కేసారం గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ,మండలంలోని హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం తనవంతు సహాయం చేయడం జరిగింది.ఈ క్రమంలోనే గ్రామంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో రాములవారి తలంబ్రాలతో ఊరేగింపుగా బయలుదేరి గ్రామంలోని ప్రతి ఇంటికి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఒజ్జా ఓదెలు వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.