
మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో బుధవారం నాడు ఎంపీపీ ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా మహిళలకు పంపిణి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయానికి ప్రతీకైన బతుకమ్మ పండుగకు సర్కారు సారె సిద్ధం చేసిందని తెలిపారు. ప్రతి ఇంటా ఆడబిడ్డలు ఆనందంతో ఉండేలా ప్రతి ఏటా ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు చేయూతనివ్వడంతో పాటు ఆడబిడ్డలకు చిరుకానుక ఇవ్వాలన్న మహోన్నత లక్ష్యంతో 2017లో ముఖ్యమంత్రి కేసీఆర్ చీరల పంపిణీ ప్రారంభించినట్టు పేర్కొన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే, కేంద్రం టెక్స్‌టైల్ ఉత్పత్తులపై జీఎస్టీ విధిస్తూ వారి బతుకుల్ని ఆగం చేస్తున్నదని ఎంపీపీ విమర్శించారు. మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచులకు క్రికెట్ కిట్ల ను అందజేశారు. గ్రామాలలో యువకులు క్రీడల పట్ల మక్కువ చూపిస్తున్నారని పేర్కొన్నారు. యువకులు క్రికెట్ కిట్లను గ్రామ పంచాయతీ అధీనంలో ఉంటుందని ఆదుకువడనికి యువకులు ఉపయోగించుకోవాలని సూచించారు. క్రీడలతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తిరుమలరెడ్డి సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి ఎంపీఓ సూర్యకాంత్ ఏపీఎం రవీందర్ కో ఆప్షన్ నెంబర్ జాఫర్ సా టిఆర్ఎస్ యూత్ మండల్ ప్రెసిడెంట్ చెప్ప రమేష్ ప్రేమ్ సింగ్ ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారులు పాల్గొన్నారు.