నవతెలంగాణ-ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు ఎంతో ప్రాముఖ్యత గల పండుగ *బతుకమ్మ పండుగ*, కానీ ఉమ్మడి రాష్ట్రములో ఆంధ్రపాలకుల పాలనలో కనుమరుగు దశలో వుండింది. ఇట్టి బతుకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యములోకి తెచ్చిన ఘనత ఎమ్మెల్సీ కవితదే . తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ కృషితో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రములో అక్కాచెల్లెళ్లు అందరూ ఘనంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని సీఎం కెసిఆర్ ఉచితంగా బతుకమ్మ చీరలు ఇస్తున్నారు..PUC చైర్మన్, భారాస జిల్లా రథ సారథి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆధ్వర్యములో ఆర్మూర్ నియోజకవర్గములో పెద్దమొత్తములో బతుకమ్మ చీరలను ఉచితంగా పంపిణి చేస్తున్నారు… ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఆర్మూర్ నియోజక వర్గ ఇంచార్జి రాజేశ్వర్ రెడ్డి ఆదేశానుసారం ఈరోజు ఆర్మూర్ పట్టణములోని జిరాయత్ నగర్ లోని రేషన్ షాపులలో రెండవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్, ప్రముఖ మహిళా న్యాయవాది, బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబర్ సంగీతా ఖాందేష్ అధ్యక్షతన మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణి చేయడం జరిగింది…ఈ కార్యక్రమములో BRS నాయకులు ఖాందేష్ సత్యం, ప్రశాంత్ RP మమత మరియు మున్సిపల్ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు…