బ్యాటరీ ట్రై సైకిళ్ల పంపిణీ

నవతెలంగాణ- సంతోష్‌ నగర్‌
రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో అర్హులైన దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు మలక్‌ పేట్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అహ్మద్‌ బిన్‌ బలాల, రాష్ట్ర వికలాంగుల కార్పోరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె. వాసు దేవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ చంచల్గూడ జూనియర్‌ కళాశాలలో బుధవారం దాదాపు 36 లక్షల వ్యయంతో 84 బ్యాటరీ ట్రై సైకిళ్లను అందజేసినట్లు చెప్పారు. బ్యాటరీ ట్రై సైకిళ్లలో ఏవైనా సమస్యలుంటే మలపేటలో ఉన్న వికలాంగుల సంక్షేమ భవన్‌లో ఉన్న అధికారులను సంప్రదించాలని సూచించారు. అనంతరం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన దివ్యాంగులకు నెలకు రూ.3016 చొప్పున పెన్షన్‌ అందజేస్తుందని కొనియాడారు. రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు 100% సబ్సిడీతో సహాయ ఉపకరణాలు, సబ్సిడీ రుణాలను అందజేస్తున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో కూడా మరిన్ని క్యాంపులు ఏర్పాటుచేసి అర్హులైన దివ్యాంగులందరికి మరిన్ని సహాయ ఉపకరణాలు అందే విధంగా కషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ ఏడీ రాజేందర్‌, కార్పొరేటర్లు ఎండీ సైఫుద్దీన్‌ షఫీ, సయ్యద్‌ మిన్హాజుద్దీన్‌, సాలం షాహిద్‌, నాయకులు షేక్‌ మోహిద్దున్‌ అబ్రర్‌, షఫీ సిబ్బంది, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.