రెంజల్ జిపి, పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ…

నవతెలంగాణ- రెంజల్ : మండల కేంద్రమైన రెంజల్ గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు ఎమ్మెస్ రమేష్ కుమార్ పంచాయతీ సిబ్బందికి దుస్తులను అందజేశారు. దసరా పండుగను పురస్కరించుకొని పారిశుద్ధ కార్మికులందరికీ పండుగ కానుకగా దుస్తులను అందజేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అన్నం గంగామణి, పాలకవర్గ సభ్యులు సగ్గు వెంకటి, గంగారెడ్డి, రంజిత్ కుమార్, రేఖ, తదితరులు పాల్గొన్నారు.