తూము శివమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యవసర సరుకుల పంపిణీ

నవతెలంగాణ-నవీపేట్: తూము శివమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని మోకన్ పల్లి గ్రామంలో నిరుపేదలకు నిత్యవసర సరుకులను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ శరత్ రెడ్డి మాట్లాడుతూ ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే బోధన్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో నిరుపేదలను గుర్తించి నాణ్యమైన నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రొడ్డ సుధాకర్, మున్సిపల్ చైర్మన్ పద్మ శరత్ రెడ్డి,ఉపసర్పంచ్ సురేష్, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పాల్గొన్నారు.