ఎన్ఎసి మహిళలకు ఫ్యాన్లు వితరణ..

నవతెలంగాణ – మంథని
ఇటివల రాష్ట్ర ఐటీ పరిశ్ర మల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని పట్టణంలో ఎన్ఏసిని సందర్శించి మహిళలకు రెండవ బ్యాచ్ కుట్లు, అల్లికల శిక్షణను ప్రారంభించగా, అనంతరం మహిళలు మంత్రి శ్రీధర్ బాబుకు ఫ్యాన్ లు సంబంధిత వస్తువులు కావాలని కోరగా గురువారం మంథని  మండల కాంగ్రెస్ నాయకులు మహిళలకు  ఫ్యానులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మంథని మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్, ప్రచార కమిటీ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, మంథని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్,మంథని పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెంటరి రాజు,కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పెద్దపెల్లి జిల్లా చైర్మన్ ఆరెల్లి కిరణ్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు సాయితేజ పటేల్,తదితరులు పాల్గొన్నారు.