కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు

– కండువా కప్పి ఆహ్వానించిన అది శ్రీనివాస్
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ రూరల్ మండలం మర్రిపెళ్లి గ్రామానికి చెందిన బీజేపీ, బిఆర్ఎస్ నాయకులు అది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీల వల్ల విసుగు చెంది ఆ పార్టీకి రాజీనామా చేశామని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల అయిన అభివృద్ధిలో ఎటు వంటి మార్పు లేదని అన్నారు. వేములవాడ నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి ఆలోచించి మన బీసీ బిడ్డా అయిన అది శ్రీనివాస్ కి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. వేములవాడ ఎమ్మెల్యేగా అది శ్రీనివాస్ ని గెలిపించుకొని వేములవాడ ను అభివృద్ధి పథంలో నడిపిస్తాం అన్నారు..
Spread the love