
మండలంలోని కమ్మర్ పల్లి, నర్సాపూర్ గ్రామాలకు చెందిన ఆరుగురు లబ్ధిదారులకు ప్రభుత్వ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మందులు చేసిన ఆర్థిక సాయం చెక్కులను శనివారం అందజేశారు. కమ్మర్ పల్లికి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు మంజూరైన రూ. లక్ష 97వేల విలువైన చెక్కులను బిఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయం వద్ద ఎంపీపీ అధ్యక్షురాలు లోలపు గౌతమి చేతుల మీదుగా అందజేశారు.నర్సాపూర్ గ్రామానికి చెందిన మక్కల మంజులకు మంజూరైన రూ.30వేల చెక్కును మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు నేరుగా లబ్ధిదారు ఇంటికి వెళ్లి అందించారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ లబ్ధిదారులు మాట్లాడుతూ… ఆర్థిక సహాయం మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, కృషిచేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి లో సర్పంచ్ గడ్డం స్వామి, ఎంపీటీసీ సభ్యుడు మైలారం సుధాకర్, గ్రామ శాఖ అధ్యక్షుడుచింత గణేష్, మండల్ కోఆప్షన్ సభ్యుడు అజ్మతు హుస్సేన్, ఉపసర్పంచ్ పాలకు చిన్న గంగారం, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,.. నర్సాపూర్ లో గ్రామ శాఖ అధ్యక్షుడు బుస్సాపురం జీవన్, సర్పంచ్ పెండ ప్రభాకర్, సొసైటీ డైరెక్టర్ బుసాపురం నవీన్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.