రెంజల్ మండలంలో చేప పిల్లలను పంపిణీ..

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో రెంజల్ మండలానికి విచ్చేసిన చేప పిల్లల ను ఎంపీపీ రజని కిషోర్, రెంజల్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఎమ్మెస్ రమేష్ కుమార్ లు చేప పిల్లలను పంపిణీ చేశారు. రెంజల్ మండలానికి 32 చెరువులకు గాను 14 లక్షల 9 వేల 910 చేప పిల్లలు మంజూరయ్యాయి వారు పేర్కొన్నారు. మండలంలోని నీల గ్రామంలో 10 చెరువులు ఉండగా, రెండు లక్షల ఇరవై ఆరు వేలు, బాగేపల్లి గ్రామానికి మూడు చెరువుల ఉండగా రెండు లక్షల ఇరవై వేలు, జూపల్లిలో మూడు చెరువుల ఉండగా 1,88 వేలు, బోర్ గాం గ్రామంలో ఒక చెరువు లక్ష 71, కల్లాపూర్ లో రెండు చెరువులకు గాను 55 వేలు, కోనేపల్లి రెండు చేరులకు లక్ష ముప్పై వేలు, రెంజల్ నాలుగు చెరువులకు గాను 1,70,000, తాడు బిలోలి రెండు చెరువులకు గాను 43000, చేప పిల్లలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎంపీడీవో శంకర్, సూపరిండెంట్ శ్రీనివాస్, ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్, టిఆర్ఎస్ నాయకులు రఫిక్, మండలంలోని మత్స్యకారులు, మత్స్యకార అధికారులు ఏడి రాజనర్సయ్య, ఎఫ్డి ఇంతియాజ్, ఫీల్డ్ ఆఫీసర్ ప్రవీణ్, ఫీల్డ్ మెన్ జానకి, తదితరులు పాల్గొన్నారు.