గ్రామ పంచాయతీ సిబ్బందికి సరుకుల పంపిణీ

సర్పంచ్‌ గీత భాగ్యరెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్‌
ఎండనక, వానక తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా గ్రామాల పరిశుభ్రత కోసం శ్రమిస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎంత చేసినా తక్కువేనని డబిల్‌ పూర్‌ గ్రామ సర్పంచ్‌ గీత భాగ్యరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినో త్సవం సదర్బంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని డబిల్‌ పూర్‌ గ్రామంలో శుక్రవారం గ్రామ పంచాయతీ సిబ్బందిని సర్పంచ్‌ గీత భాగ్యరెడ్డి సన్మానించారు.అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బంది 19మంది సిబ్బందికి కొత్త బట్టలు పెట్టి,తన సొంత ఖర్చుతో రూ.3వేల విలువగల 16రకాల వంట సామాను అందజేశారు.ఈ సందర్బంగా సర్పంచ్‌ గీత భాగ్యరెడ్డి మాట్లాడుతూ తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా గ్రామ పరిశుభ్రత కోసం కష్టపడుతున్న పంచాయతీ సిబ్బందికి ఎంత చేసిన తక్కువేనన్నారు. ఎలాంటి రోగాలు రాకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే పంచాయతీ సిబ్బందిని గౌరవించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ ఉమాదేవి,ఎంపీటీసీ హేమలత, ఉప సర్పంచ్‌ సత్యనారాయణ,వార్డు సభ్యులు దామోదర్‌ రెడ్డి, కవిత ,హరి ప్రసాద్‌,నాయకులు భాగ్యరెడ్డి,తలారిఅశోక్‌, శ్రీనివాస్‌, గంగారామ్‌ ,పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.