నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని కోనాపూర్ గ్రామంలో పలువురు యువతీ యువకులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో లెర్నింగ్ లైసెన్స్ పేపర్లు, హెల్మెట్లను స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందజేశారు. సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద యువకులకు లెర్నింగ్ లైసెన్స్ పేపర్లు, హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ మంత్రి ప్రశాంత్ రెడ్డి తన సొంత ఖర్చులతో డ్రైవింగ్ లైసెన్స్ లతోపాటు ఉచతంగా హెల్మెట్ లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. యువత మేలు కోరి ఇంత మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఎప్పటికీ మర్చిపోలేమని, ఎల్ల వేళలా వారి సేవలో ఉంటామని తెలుపుతూ యువకులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. యువతీ యువకుల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు ప్రమాదాల బారిన పడకూడదన్న సదుద్దేశంతో మంత్రి ఉచితంగా హెల్మెట్లను అందించడం అభినందనీయమన్నారు. యువతీ యువకులు ప్రయాణాలు చేసేటప్పుడు హెల్మెట్లను ఉపయోగించడం ద్వారా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దయ్య దేవయ్య, ఎంపీటీసీ సభ్యుడు లకావత్ గంగాధర్, సింగిల్ విండో చైర్మన్ బడాల రమేష్, మండల ఉపాధ్యక్షులు టేకుల రాజు, మండల ఎస్టి సెల్ అధ్యక్షులు లకావత్ సంతోష్, గ్రామ శాఖ అధ్యక్షులు ఉత్కం నర్సాగౌడ్, ఉపసర్పంచ్ టేకుల జలంధర్, పార్టీ నాయకులు రమేష్ రెడ్డి, జలా రాజు ,రాజేందర్, రంజిత్, వంశీ, నవీన్, గ్రామ యువకులు, తదితరులు పాల్గొన్నారు.