నవతెలంగాణ-మట్టెవాడ
పరిసరాలను శుభ్రం గా ఉంచి ప్రజలకు వ్యాధు లు ప్రభలకుండ పారిశుద్ధ పనులు నిర్వహిస్తున్న కా ర్మికుల బాగోగులు చూసు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదని బీ ఆర్‌ఎస్ నాయకులు, యన్స్‌క్లబ్ పూర్వఅధ్యక్షులు గందె నవీన్ అన్నారు. దసరా పండగ సంద ర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ వారి ఆధ్వర్యంలో 28వ డివిజన్ లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ పోతన అధ్యక్షుడు లయన్ పోరండ్ల రత్నాకర్ రావు ఆధ్వర్యంలో మహిళలకు చీరలు మగవారికి నూతన వస్త్రాలు పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన చే తుల మీదుగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు అనంతరం మాట్లాడు తూ కరోనా సమయంలో మనకు పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు మనం ఎప్పటికీ మర్చిపోలేమని, పరిసరాలు బాగుంటేనే ప్రజలు బా గుంటా రని దానికోసం పారిశుద్ధ్య కార్మికుల దైనందిన పరిశ్రమ సమా జానికి ఎంతైనా అవసరమని అలాంటివారిని సత్కరించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ క్లబ్ సభ్యులు, స్థానిక నాయకులు, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.