నేటి నుంచి రైతులకు పోడు పట్టాల పంపిణీ

– మొదటి విడతలో గిరిజనులకు మాత్రమే
– పోడు హక్కు పత్రాలు పొందిన రైతులకు రైతుబంధు
– 30 వరకు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవచ్చు
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలం కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన పోడు భూములకు పట్టాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హనుమాన్ షిండే విచ్చేశారు పోడు భూముల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోడు భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్న బాధిత రైతుల కల ఎట్టకేలకు నెరవేరనుంది. పోడు భూములకు సంబంధించి ఆయా రైతులకు పట్టాలు, పాస్‌ పుస్తకాలను అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారులు ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాలలో 532 మంది మొదటి ప్రాధాన్యత కింద గిరిజనులకు మాత్రమే పోడు పట్టాలను ప్రభుత్వం అందజేస్తోంది.  పంపిణీ కార్యక్రమంలో జుక్కల్ మండలంలో 71రైతులకు, పేద్ద కోడప్ గల్ మండలంలో 186, పిట్లం మండలంలో 139, బిచ్కుంద మండలంలో 36, నిజాంసాగర్ మండలంలో 100 మంది రైతులకు మండలంలోని చాలా మంది గిరిజనేతరులు ఎన్నో ఏళ్ల నుంచి పోడు భూముల్లో సాగు చేసుకుంటున్నారు. వేలాది మంది గిరిజనేతరులు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి హక్కు పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. దీంతో గిరిజనేతరులకు పోడు పట్టాల కోసం నిరీక్షణ తప్పేటట్లు లేదు.
పోడు భూములకు రైతుబంధు
పోడు భూములకు సంబంధించి హక్కు పత్రాలు పొందే రైతులకు రైతుబంధు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పోడు హక్కు పత్రాలు పొందుతున్న రైతుల వివరాలనుఆయా మండలాల వ్యవసాయశాఖ అధికారులు సేకరిస్తున్నారు. నేటి నుంచి రైతులు పోడు హక్కు పత్రాలను తీసుకోనున్నారు. సంబంధిత రైతులు ఈనెల 30లోపు వ్యవసాయాధికారులకు అందజేస్తే జూలై 3 లోపు ఆన్‌లైన్‌లో నమోదుచేయడానికి అవకాశం ఉంటుందని వ్యవసాయాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రెవెన్యూ, ట్రైబల్‌ వెల్ఫేర్‌, అటవీశాఖల నుంచి సేకరించిన పోడు భూముల అర్హుల రైతుల వివరాలను వ్యవసాయాధికారులు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, సర్పంచ్ తిరుమలరెడ్డి,ఎమ్మార్వో దశరథ్,ఎంపీడీవో రాణి, సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి,కో ఆప్షన్ నెంబర్ జాఫర్ష, ఐదు మండలాల ఎమ్మార్వోలు, లబ్ధిదారులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.