రేషన్‌ కిట్లు పంపిణీ

– పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
ఆత్మీయ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం తాం డూరు పట్టణ కేంద్రంలో దసరా పండుగ సందర్భంగా రేషన్‌ కిట్లను ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి తాండూరు మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ వీణా శ్రీనివాస్‌ చారితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..మిత్రులు అందరూ సేవా గుణంతో దసరా పండుగకు పేదలను పేదలను ఆదుకోవడం గొప్ప విషయమని అన్నారు. కార్యక్రమంలో సభ్యులు బీఅర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు శ్రీనివాస్‌ చారి, బంట్వారం సుధాకర్‌, రొంపల్లు సంతోష్‌, మల్‌ రెడ్డి, అషద్‌, ముకేష్‌, ప్రసాద్‌ తదతరులు ఉన్నారు.