నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని సఫాయి కార్మీకులకు, ఇళ్లు కూలీన నిరుపేదలకు ముసలివాళ్లకు దుప్పట్లు, కార్పేట్లు, సఫాయి కార్మీకులకు బుట్లు, గ్లౌస్ లు, మండల రెడ్ క్రాస్ చైర్మేన్ డొంగ్లే ఉమాకాంత్ ఆధ్వర్యంలో బస్వాపూర్ సర్పంచ్ రవిపటేల్ తో కలిసి శనివారం నాడు పంపిణి చేయడం జర్గింది. ఊ సంధర్భంగా మండల రెడ్ క్రాస్ చైర్మేన్ ఉమాకాంత్ మాట్లాడుతు మండలంలో ప్రజలకు సమస్యలుంటే రెడ్ క్రాస్ వారు వెంట ఉండి వారికి తమవంతుగా సమాజిక సేవలో బాగంగా సేవలు సపర్యాలు చేస్తామని, ఉడుత భక్తీగా ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలలో పాలుపంచుకుని వెన్నంటి ఉంటామని పేర్కోన్నారు. కార్యక్రమంలో గ్రామస్తు లు శివరాజ్ దేశాయి, విశ్వనాథ్ తదితరులు పాల్గోన్నారు.