
బీర్కూర్ మండలంలోని దామరాంచ గ్రామంలో ప్రభుత్వ సబ్సిడీపై జీలుగా, పచ్చి రొట్టె విత్తనాలను సొసైటీ అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి రైతులకు అందజేశారు. శనివారం దామరాంచ గ్రామంలోని సహకార సంఘం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పచ్చి రొట్ట ఎరువులు అయిన జీలుగు విత్తనాలు దామరంచ సహకార సంఘం నందు పంపిణీ చేయడము జరుగుతుంది. 30 కిలోల జీలుగా బస్తా రాయతీ పోను రైతు చెల్లించవలసిన ధర రూ.843 ఉంది. ఒక బస్తా 2 1/2 (రెండున్నర) ఎకరాలకు సరిపోతుందన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ.. రైతులు విత్తనాలు పొందాలంటే తప్పనిసరిగా పట్టా పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, మరియు మొబైల్ నెంబర్ సమర్పించాల్సి ఉంటుందని, ఈ కార్యక్రమంలో వైస్ యం పి పి కాశిరం, గ్రామ సర్పంచ్ విఠల్, రైతు బందు సమితి గ్రామ అధ్యక్షులు నబీ, ఏఈఓ అనూష, ప్రాథమిక సహకార సంఘం సీఈఓ అబ్బాస్, సొసైటీ డైరెక్టర్లు, తదితరులు హాజరయ్యారు.