నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రానికి చెందిన గంప రాధాబాయి, రాజేశం దంపతులు శుక్రవారము మహిళలకు శ్రావణ మాస వాయినాలు అందజేశారు. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని వారి నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, 500 మంది ఆడపడుచులకు బియ్యం, బెల్లం, పప్పు, రైస్ కుక్కర్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రావణమాసంలో ఆడపడుచులకు శ్రావణ మాస వాయినాలు అందించడం జరుగుతుందని, ఈ సంవత్సరం ఏడాది కూడా ఆడపడుచులకు ఇస్తున్నట్లు తెలిపారు. లోక కళ్యాణార్థం అన్ని వర్గాల ప్రజల సుఖసంతోషాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.