
మండలంలోని తలమడ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బుధవారం గ్రీన్ కో సోలార్ పవర్ ప్లాంట్ యాజమాన్యం ఆట వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రీన్ కో సంస్థ ప్రతినిధి రవిచంద్ర మాట్లాడుతూ.. విద్యార్థులు ఆటల్లో ముందు స్థాయిలో నిలబడి మండల, జిల్లాస్థాయిలో పాఠశాలకు గుర్తింపు తెచ్చే విధంగా ఉండడానికి ఆట వస్తువులు పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు ఇందులో భాగంగావాలీబాల్ సెట్స్ 3, క్యారం బోర్డు 2, టెన్నికాయిట్ 4, చెస్ 3, షార్ట్ పుట్ 4, షటిల్ బ్యాట్స్ 6 అందచేశారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ యాదవరెడ్డి, ఎంపీటీసీ రాజు ఎస్ ఎం సి చైర్మన్ స్వామి, శ్రీనివాస్ గౌడ్, ప్రధానోపాధ్యాయులు అంజల్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.