నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను బుదవారం జిల్లా ఎన్నికల పోలీస్ అబ్జర్వర్, ఐపీఎస్ సోనమ్ టెన్సింగ్ బూటియా సందర్శించారు. హుస్నాబాద్ ఏసీపీ సతీష్, పోలీస్ అధికారులకు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు గురించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కోన్నారు . క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద బలగాలతో బంధుబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రూట్ మొబైల్ అధికారులు ఈవీఎం వివి ప్యాట్ ఎన్నికల సామాగ్రి రక్షణ బాధ్యత ఉంటుందని సూచించారు. రూట్ మొబైల్ అధికారులు వారికి కేటాయించిన రూటల్లో 48 గంటల పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండాలని సూచించారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించాలని, అదే సమయంలో ఉన్నతాధికారులకు తెలపాలని సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
ప్రజలు, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటింగ్ శాతం పెంచాలని సూచించారు. ప్రజలు ప్రజా ప్రతినిధులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాలని సూచించారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున అయిదురు కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ గుమికూడా వద్దని తెలిపారు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . ప్రజలకు, ప్రజాప్రతినిధులకు యువతి, యువకులకు విజ్ఞప్తి, ఫ్రీ అండ్ ఫెయిర్ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని తెలియజేయాలనుకునేవారు పోలీస్ ఎన్నికల అబ్జర్వర్ టెన్సింగ్ భూటియా ఐపీఎస్ సెల్ నెంబర్ 8712667309 సమాచారం అందించాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన ఏదైనా ఫిర్యాదు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1950 కాల్ చేయాలని సూచించారు. సి విజిల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని అందులో కూడా ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు.