జిల్లా కిసాన్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం

నవతెలంగాణ – కంటేశ్వర్
కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కిసాన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ముప్పగంగారెడ్డి అధ్యక్షతన జిల్లా కిసాన్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఇంచార్జ్ ఆది రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జ్ ఆది రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వరి కోత కోయని రైతులు వడ్లు రాలిపోయి చాలా బాధపడ్డారని, కోత కోసి కళ్ళలో కుప్ప చేసిన రైతులు వరిధాన్యం పూర్తిగా తడిసిపోయి నీళ్లలో కలిసిపోవడంతో తీవ్రంగా బాధపడుతున్నారని, మరో ప్రక్క తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తీసుకోవడం లేదని ,ప్రభుత్వం ఆలస్యంగా తూకం వేసి ధాన్యాన్ని తరలించడంతో రైస్ మిల్లర్లు కడ్త పేరుతో రైస్ రైతులను దోచుకుంటున్నారని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తామని కేవలం మాటలకే పరిమితమైందని, రైతులు ఇంతగా నష్టపోతున్నా ఒక్క ఎమ్మెల్యే కూడా రైతుల దగ్గరికి వచ్చి వారి బాధలు తెలుసుకోవడం లేదని ఆయన అన్నారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు ముందు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తెలియజేశారు.అదేవిధంగా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని దానికోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి పని చేయాల్సి ఉంటుందని, గ్రామస్థాయిలో కిసాన్ కాంగ్రెస్ను బలపరిచి ప్రభుత్వంపై రైతులకు న్యాయం జరిగే వరకు ఒత్తిడి తెస్తామని ఆయన అన్నారు. సమీక్ష సమావేశానికి హాజరుకాని కిసాన్ కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకుంటామని ఆదిరెడ్డి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మహిపాల్, వేల్పూర్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, కమ్మర్పల్లి కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ ,డిచ్ పల్లి కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయి రెడ్డి, మోపాల్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యంరెడ్డి, బోధన్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మందర్న రవి, గాండ్ల సంతోష్, శంకర్ ,గొనివర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.