
విద్యార్ధి నాయకుడిగా రాజకీయాల్లోకి ఆకర్షితుడై నేటి వరకు సంఘటిత అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం ప్రజల్లోనే ఉంటున్న సీపీఐ(ఎం) అభ్యర్ధి అర్జున్ రావు పిట్టల ను గెలిపించి అసెంబ్లీకి పంపాలని విజ్ఞప్తి చేసారు. అనంతరం ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న పుల్లయ్య పరిచయస్తులు ను ఆయనతో పాటు అభ్యర్ధి అర్జున్ రావులు లు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్ధి అర్జున్ రావు, మండల కమిటీ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు, తగరం జగన్నాధం, కలపాల భద్రం, రాంచరణ్ లు పాల్గొన్నారు.