పల్లె పల్లెకు కాంగ్రెస్ పథకాలు: జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి

నవతెలంగాణ- ఆర్మూర్
పల్లె పల్లెకు కాంగ్రెస్ పథకాలు అనే నినాదంతో ఆరు గ్యారటి పథకాలను ప్రజలలోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఆలూరు మండలంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలన్నీ కాంగ్రెస్ నాయకులు, గోర్తా రాజేందర్. తో కలిసి ప్రారంభించినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె పల్లెకు కాంగ్రెస్ అనే నినాదంతో ఆలూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. 6 గ్యారంటీ పథకాలతో   కార్యకర్తలకు, ప్రజలకు ఎంత  ఉత్సాహాన్ని ఇచ్చిందని వారు తెలిపారు.  కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాల పై ప్రజలకు నమ్మకం ఏర్పడిందని  గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంటు బకాయిలు ఉచిత కరెంటు నూతన రుణాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రజలు కోరుకుంటున్నారని వారు చెప్పారు. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం, రైతు రుణమాఫీ అనేక విషయాలతో మోసం చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని ఉన్నారు.  ఈసారి మళ్లీ మోసపూరితమైన మేనిఫెస్టోని తీసుకొని టిఆర్ఎస్ రాబోతుందని వారిని తరిమి తరిమి కొట్టాలని హెచ్చరించారు. కెసిఆర్ మోసపూరిత హామీలను ఎవరు నమ్మవద్దని భవిష్యత్తు తరాలకు కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని సూచించారు. ఈరోజు ఎక్కడికెళ్లిన  ఆర్మూర్ నియోజక  వర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, కాంగ్రెస్ గెలుపు కాదు మెజారిటీ లక్ష్యంగా ప్రజల్లో ఉత్సహం కనిపిస్తుందని అన్నారు. ఈ సంక్రాంతికి టిఆర్ఎస్ ఫీడాదినాలు పోయి కాంగ్రెస్ తో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో కూడిన సంక్రాంతిని జరుపుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మండల మోహన్ రెడ్డి, పొద్దుటూరు వినయ్ రెడ్డి, డేగ పోశెట్టి, తాహీర్ బిన్ అందన్, కోల వెంకట్ , ఆలూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ పుట్టింటి  శ్రీనివాస్ రెడ్డి, ఉదయ్ నవనీత్ మల్లారెడ్డి , గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..