మండల కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీగా నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంగళవారం నాడు పోలీస్ స్టేషన్ ను సందర్శించడం జరిగింది. పోలీసు స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటి నీరు పోశారు.పొలీస్ స్టేషన్ లో రికార్డులను పరిశీలించి నేరాల వివరాలను స్థానిక.ఎస్ఐ ను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతలను అదుపులో ఉంచి ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు.తెలంగాణ రాష్ట్రం లో ఎన్నిక కోడ్ ను ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు ఎన్నికల కోడ్ ఉన్నందున పోలీసులకు జనాలు సహకరించాలని వాహన దారులు డబ్బును తీసుకెళ్లేటపుడు వాటికి సంబంధించిన పత్రలను వెంట ఉంచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలోడిఎస్పీ జగన్నాథ్ రెడ్డి,సిఐ కృష్ణ,ఎస్ఐ కొనారెడ్డి పోలీసు సిబందులు పాల్గొన్నారు.