జెంటిల్ కిడ్స్ పాఠశాలలో దీపావళి సంబరాలు

నవతెలంగాణ ఆర్మూర్:  పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాల నందు శుక్రవారం దీపావళి పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ దీపావళి పండుగ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలందరూ దీపాలను వెలిగించారు పిల్లలు ఆనంద ఉత్సాహాల మధ్య దీపావళి పండుగ సంతోషంగా జరుపుకున్నారు ఇట్టి కార్యక్రమంలో దీపావళి విశిష్టత గురించి పాఠశాల కరస్పాండెంట్ గుజరాతి ప్రకాష్ పిల్లలకు దీపావళి శభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లత పిల్లలు ఉపాధ్యాయ ఉపాధ్యాయనీ బృందం పాల్గొన్నారు.