ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన డీఎంహెచ్ఒ

నవతెలంగాణ-భిక్కనూర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని డిఎంహెచ్ఒ లక్ష్మణ్ సింగ్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని రికార్డులను, న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ, గర్భిణీ స్త్రీల వివరాలు పరిశీలించి, ల్యాబ్ రికార్డులను తనిఖీ చేసి గర్భిణీ స్త్రీలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స ఏ విధంగా అందుతుందో మాట్లాడారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు చికిత్స అందజేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి యేమిమా, హెచ్ ఇ వో వెంకటరమణ, ల్యాబ్ టెక్నిషియన్ లతిఫ్, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.