
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి లక్ష్మణ్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పలు రికార్డులను, ఆస్పత్రిని తనిఖీ చేశారు. ప్రసూతి అయిన తల్లికి కెసిఆర్ కిట్టు ను అందజేశారు. మదర్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రాం లో వచ్చే ప్రతి బెన్ఫిట్ ను లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో పిహెచ్ఎస్సి వైద్యులు సురేష్, ఆయుష్ వైద్యులు రమ్యశ్రీ, సిబ్బంది భీం, శ్రీహరి, దోమల శ్రీధర్, స్వాతి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.