నవతెలంగాణ-మహాదేవపూర్
సండ్రపల్లిలో ఎస్ఐ లక్ష్మణరావు ఆధ్వర్యంలో సోమవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటా క్షుణ్ణంగా తనిఖీలు చేప ట్టారు. అనంతరం ప్రధాన కూడలిలో ప్రజలతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడి యాలో అసభ్యకర పోస్టులు పెడితే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. అనుమానిత వ్య క్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందిం చాలని, అం దించిన వారికి తగిన నగదు బహు మతి ఇస్తామని, వివరాలు గోప్యంగా ఉంచుతా మని తెలిపారు. గుట్కా గుడుంబా విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట పరంగా చర్యలు చేపడతామని తెలిపారు. యువత బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరో హించాలని తెలిపారు. గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్, సిబ్బంది యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.