చీరల పంపిణీకి ఆధార్‌ నెంబర్లు ఇవ్వొద్దు

Do not give Aadhaar numbers for distribution of sareesనవతెలంగాణ-కేశంపేట
మహిళలకు ఉచితంగా పంపిణీ చేసే చీరల కోసం ఆధార్‌ నెంబర్ల సేకరణ అవసరం లేదని కేశంపేట పోలీసులు తెలిపారు. సోమవారం కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో పాలమూరు చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు లబ్ధిదారుల నుండి ఆధార్‌ నెంబర్లను సేకరించారు. ఈ విషయాన్ని అంబేద్కర్‌ గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్‌, మహిళలు, యువకులు ఆధార్‌ నెంబర్ల సేకరణను నిరాకరించారు. ఈ నేపథ్యంలో కొందరు 100కు డయల్‌ చేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆధార్‌ నంబర్ల సేకరణపై మహిళలకు, చీరల పంపిణీ నిర్వాహకులకు అవగాహన కల్పించారు. సైబర్‌ నేరాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆధార్‌ కార్డులతో సంబంధం లేకుండా చీరల పంపిణీ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, భీమయ్య, బాల్‌ రాజ్‌, శేఖర్‌, కష్ణ, బాలయ్య, మల్లేష్‌, మహిళలు, గ్రామ యువకులు, తదితరులు పాల్గొన్నారు.