నవతెలంగాణ – భిక్కనూర్
గడువు ముగిసిన మందులను విక్రయించవద్దని ఏడిఏ అపర్ణ తెలిపారు. శనివారం భిక్నూర్ పట్టణంలో సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెస్టిసైడ్స్ మందులు ఎప్పటికప్పుడు గడువును చూసుకోవాలని, కాలం చెల్లిన మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సూచించారు. దుకాణంలో ఉన్న ప్రతి మందు యొక్క వివరాలు రికార్డులలో నమోదు చేయాలని, నకిలీ మందులు, విత్తనాలు విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఏవో రాధా, ఏఈఒలు, తదితరులు ఉన్నారు.