పోషకాహారాలు కొలువై ఉన్న ఆహార పదార్థాల్లో గుడ్డు ఒకటి. రోజుకో గుడ్డు తినడం ఆరోగ్యానికి మేలని ప్రభుత్వమే ప్రచారం చేయిస్తోంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకల పటిష్టతకు దోహదపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో గుడ్లకు సాటేదీ లేదు. కానీ గుడ్లను ఎక్కువరోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడం మంచిది కాదంటున్నారు నిపుణులు. అలా చేయడం వల్ల ప్రమాదమే ఎక్కువట. అనారోగ్యాలను కొనితెచ్చుకోవడమేనట. అలా చేయడం వల్ల జరిగే నష్టాలేంటో తెలుసుకుందాం…
గుడ్లు ఎక్కువరోజులు నిల్వ ఉంటే అందులో బాక్టీరియా పెరిగి తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఫ్రిజ్‌లోని ఉష్ణోగ్రత సున్నా కంటే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆహారాన్ని ఉంచడం మంచిదే. కానీ గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు వాటిలో ఒక రకమైన హానికరమైన బ్యాక్టీరియా పుడుతుంది.
గుడ్లను ఉడికించినప్పుడు సాధారణంగా ఫ్రిజ్ నుండి గుడ్లను తీసి నేరుగా వాటిని ఉపయోగిస్తాము. కాబట్టి గుడ్డులో పుట్టిన బ్యాక్టీరియా సజీవంగా ఉంటుంది. దానివల్ల ఫుడ్ పాయిజనింగ్, వివిధ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచితే అవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. కానీ వాటిని బయటపెడితే కొద్ది రోజుల్లోనే పాడవుతాయని అమెరికా ప్రపంచానికి నేర్పించింది. అప్పటి నుండి ప్రపంచం మొత్తం ఈ నియమానికి అలవాటు పడింది. దాంతో రిఫ్రిజిరేటర్లలోనూ గుడ్లు పెట్టడానికి ప్రత్యేక అల్మారాలు ఏర్పాటుచేశారు.
గుడ్లను ఎక్కువసేపు బయట ఉంచడం మంచిదికాదు. అదే సమయంలో ఎక్కువరోజులు ఫ్రిజ్‌లో ఉంచడం కూడా సురక్షితం కాదు. మరి దీనికి మార్గమేమిటి అనుకుంటున్నారా..? మీకు కావలసినన్ని గుడ్లను కొన్న తర్వాత వాటిని త్వరగా వండుకోవడమే అని నిపుణులు అంటున్నారు. అనవసరంగా ఎక్కువ గుడ్లు కొని నిల్వ చేయవద్దని సూచిస్తున్నారు.