24 గంటల బీఆర్ఎస్ కావాలా.. 3 గంటల కాంగ్రెస్ కావాలా..

– ఇతర రాష్ట్రాల్లో చెల్లని హామీలు తెలంగాణలో చెల్లుతాయా..
– మంచిప్ప ప్రాజెక్టును అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు..
– బీఆర్ఎస్ రూరల్ అభ్యర్తి బాజిరెడ్డి గోవర్ధన్..
నవతెలంగాణ- డిచ్ పల్లి: 24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా.. లేక 3 గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలో రైతులు, ప్రజలు ఆలోచించుకోవాలని బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్తి బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం డిచ్పాల్లి మండలంలోని నక్కలగుట్ట తండా, గొల్లమట్ తండా, నడిమితండా, ఖిల్లా డిచ్పాల్లి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలనుద్దేశించి బాజిరెడ్డి మాట్లాడారు. మంచిప్ప ప్రాజెక్టును రూరల్ నియోజకవర్గానికి వరప్రధాయినిగా చేద్దామనుకుని పనులను ప్రారంభిస్తే కావలని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రజలను ఆయోమయానికి గురి చేసి పనులు జరుగకుండా అడ్డుకున్నారని తెలిపారు. గతంలో పాలించిన పాలకులు గ్రామాలను అన్ని వర్గాల ప్రజలను విస్మరించి పాలన చేశారని తెలంగాణ వచ్చిన తర్వాత ఏ గ్రామం చూసినా కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపట్టం జరిగిందన్నారు. సిఎం కేసీఆర్ దళితులను ఆదుకోవడానికి వారికి సముచిత స్థానం కల్పించడానికి దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ స్త్రీ అన్నారు. ఇతర వర్గాల వారికి బీసీ బంధు, మైనార్టీ బంధు అందజేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 400 లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు. నేటి నుండి రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ అవుతుందన్నారు. కాంగ్రెస్కు చెందిన రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి ఎలక్షన్ కమీషన్కు ఫిర్యాదు చేసి రుణమాఫీ, – రైతుబంధు నిలుపుదల చేయించాలని చూసినా వీలుకాలేదన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలను రైతులు, ప్రజలు నమ్మొద్దన్నారు. ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలతో చేతికొచ్చిన వరిధాన్యాన్ని గ్రామాల్లో కొనుగోళ్లు సొసైటీల ద్వారా చేసి నేరుగా రైతు ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్న సర్కార్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటేనన్నారు. బీడీ కార్మికులకు కటాప్ డేట్ను ఎత్తివేస్తామని ప్రకటించారని, అధికారంలోకి వచ్చిన వెంటనే బీడీలు చేసే వారందరికీ పింఛన్ అందజేస్తామన్నారు. పింఛన్లను వంతులవారీగా 5 వేలకు పెంచుతామని, అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. తండాల్లో, గ్రామాల్లో మిగిలిపోయిన కొద్ది పాటి అభివృద్ధి పనులను అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామని బాజిరెడ్డి హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా గొల్లమాట్ తండకు వచ్చిన బాజిరెడ్డి గిరిజనులతో కలిసి హోటల్లో చాయ్ తాగారు. మహిళలు మంగళహారతులు, బోనాలు, చేపల వలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్  రూరల్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, మండల అధ్యక్షులు చింత శ్రీనివాస్డ్డి, జడ్పీటీసీ దాసరి ఇందిరా లక్ష్మీనర్సయ్య, సర్పంచ్లు గడ్డం రాధాకిష్టారెడ్డి, సొసైటీ చైర్మన్ గజవాడ జైపాల్, ఉప సర్పంచ్ రవిందర్, ఖిల్లా రామాలయ చైర్మన్ మహేందర్ రెడ్డి, శక్కరికొండ కృష్ణ, నల్లవెల్లి సాయిలు, పద్మారావు, గజవాడ రాములు, ప్రతాప్రెడ్డి, లొక్కిడి గిరి, సర్దార్, విఠల్ రాథోడ్, అంబర్సింగ్, పైజల్ పాషా, కోఆప్షన్ సభ్యులు నయీం, పవన్ దండుగుల సాయిలు, మోహన్రెడ్డితో పాటు నాయకులు పాల్గొన్నారు.