అంతరిక్షపు అంతరంగపు
చరిత వెలుగుల మధ్య
ఉపగ్రహాల అనుసంధానం
సంచలనపు అనుబంధమయ్యింది..!
డాకింగ్ పదజాలం ప్రభంజనమై
నా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంది
అగ్రరాజ్యాలు అందుకోలేనంత ఎత్తులో…!!
ఇస్రో స్టాంప్ మా గుండెల నిండా నింపుకొని
గర్వపు మౌనం జనగణమన పాడుతుంది..!
దేశపు విశ్వాసం వందేమాతరమై వ్యాపిస్తుంది..!
ఫలితమేదైనా అనుకున్నది సాధించేవరకూ
ఆపలేని సుదూర ప్రయాణం మాది..!
అనంత దూరాల్లో దాగిన నక్షత్రాల పరిమళాలను
అరచేతిలో పట్టుకోవాలనే కలల సౌధం మాది..!
మేమంతా భారతీయులం.
విశ్వ రహస్యాల దారిలో బాటసారులం..!!
– ఫిజిక్స్ అరుణ్ కుమార్, 9394749536