దొడ్డి కొమరయ్య గొప్ప విప్లవకారుడు

– హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ
– కందుకూరులో దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ
నవతెలంగాణ-కందుకూరు
దొడ్డి కొమరయ్య గొప్ప విప్లవ వీరుడునీ, దొరలపై పోరాటం చేసిన మహనీయుడనీ ఆయన ఆశయాలను నెరవేర్చాలని హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ… రజా కార్ల దౌర్జ న్యాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొమరయ్య అని కొనియాడారు. తెలం గాణ ఉద్యమం లో బలహీన వర్గాల పాత్ర గొప్పదన్నారు. కొమరయ్య తన జీవి తాన్ని తెలంగాణ కోసం అంకితం చేశారని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కళాకరులతోనే సాధ్య మైందన్నారు. ఒగ్గు కళలను అభివద్ధి చేయాలన్నారు. ఆటడగుగు వర్గాలకు సముచిత స్థానం దక్కితే గౌరవం దక్కుతుందన్నారు. అట్టడుగు సామాజిక వర్గాలకు న్యాయం జరగు నప్పుడే సామాజిక తెలంగాణ సాధ్యమ వుతోం దన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, విమలక్క, కురుమ సంఘం నాయకులు క్యామ మల్లేష్‌, గొరిగే మల్లేష్‌, ఎగ్గడి సతయ్య, కురుమ సంఘం నాయకులు పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.