
యాకుత్ పురా నియోజకవర్గం కంచాన్ బాగ్ డివిజన్ డిఎంఆర్ఎల్ పరిధిలోని వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా మెడికో ఆసుపత్రి బేగంపేట్ సౌజన్యతో మెగారక్తదాన శిబిరానికి విశేషస్పందన లభించింది. డీఎంఆర్ఎల్ అధ్యక్షులు కే. శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, వర్కర్స్ కమిటీ డాక్టర్ ఆర్ బాల మురళి కృష్ణ డైరెక్టర్ డీఎంఆర్ఎల్ డాక్టర్ జి. అప్పారావు ఎడి. డాక్టర్ భట్టాచార్య డివోఎంఎస్ మౌజ్, డాక్టర్. శశాంక్ కుమార్ శ్రీవాస్తవ, రామారావు, చైర్మన్ ఎం సి చెన్నప్ప నాయక్, కో-వైస్-చైర్మన్ పి.బాలరాజు, సెక్రెటరీ సి. ప్రభాకర్, జనరల్ సెక్రెటరీ తో కలిసి ప్రారంభించారు. రక్తదాన శిబిరానికి పలు ఉద్యోగస్తులు యువత స్వచ్ఛందంగా కదిలి వచ్చారు. ఎంప్లాయిస్ స్వచ్ఛందంగా చేరు కుని రక్తదానం చేశారు. సందర్భముగా అధ్యక్షులు మాట్లాడుతూ.. ఉద్యోగస్తులు స్వచ్ఛందంగా శిబిరంలో పాల్గొన్నారని చెప్పారు. ఏఐడిఈ ఎఫ్ ఆధ్వర్యంలో ‘మానవుడే మాధవుడు, అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న” అని, దాతలు ఎవరైనా రక్తాన్ని దానం చేసి, మరొకరి ప్రాణాలను కాపాడవచ్చన్నారు. తలసస్మియా రోగులకు రక్తదానం వివిధ తరగతుల ఉద్యోగస్తులు రక్తదాన చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని, సమాజ సేవకు తాను ముందుంటానని పేదలను ఆదుకోవడం. తన బాధ్యత అని పేర్కొన్నారు. రక్తదాన శిబిరంలో హాజరైన ఎంప్లాయిస్ యువత యువకులకు అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు సిబ్బంది వైద్య అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.