నిలోఫర్‌ ఆస్పత్రికి వైద్యపరికరాల విరాళం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రమాదకరస్థాయిలో ఉన్నవారికి శ్వాస అందించేందుకు ఉపయోగపడే వైద్య పరికరాలను అసోసియేషన్‌ ఫర్‌ ఏపీ పెన్షనర్స్‌ సెటిల్డ్‌ ఎట్‌ హైదరాబాద్‌ అందజేసింది. మంగళవారం హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లోని నిలోఫర్‌ పిల్లల ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టి.ఉషారాణికి వీటిని అందజేసారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షులు కె.నళిని మోహన్‌ కుమార్‌, అసోసియేట్‌ అధ్యక్షులు వి.వి.జనార్థన్‌ రావు, అదనపు కార్యదర్శి డి.మీరంశెట్టి, దాతలు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.