
రెడ్ క్రాస్ లో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు లయన్స్ సహారా నిజామాబాదు వారి చేయూతతో శుక్రవారం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. లయన్స్ సహారా నిజామాబాదు అధ్యక్షులు సూర్య భగవాన్ మాట్లాడుతూ.. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా కల్పిస్తున్న సేవలకు రెడ్ క్రాస్ సొసైటీ ని అభినందిస్తూ మేము కూడా సేవలో భాగస్వామ్యం కావాలనే ఈ రోజు తలసేమియా పిల్లలకు మరియు వారి తల్లితండ్రులకు ఒక్క పూట భోజన సదుపాయం కల్పించడం జరిగింది. తదుపరి రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ.. లయన్స్ సహారా ప్రతినిధులు చేపట్టిన ఈ కార్యమానికి అభినందిస్తూ మున్ముందు కూడా ఇదే విదంగా రెడ్ క్రాస్ సేవల్లో పాలుపంచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో డా.రాజేంద్ర ప్రసాద్, డా. శ్యామ్ సుందర్ మరియు ప్రతినిధులు పాల్గొన్నారు.