దుర్గామాత షేడ్డుకు విరాళాలు అందజేత

నవ తెలంగాణ- నవీపేట్: మండలంలోని నాలేశ్వర్ గ్రామంలో శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే దుర్గామాత ఉత్సవాలలో భాగంగా షెడ్డు నిర్మాణానికి సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాన్లు, బీఆర్ఎస్ నాయకులు ఆర్మూర్ శ్రీనివాస్ 30 వేల చొప్పున చొప్పున బుధవారం విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మగ్గరి హన్మాన్లు మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత షెడ్డు నిర్మాణానికి తన వంతు  సాయం చేయడం సంతోషంగా ఉందని దుర్గామాత ఆశీస్సులతో పాడిపంటలతో పాటు ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.