
నవతెలంగాణ – మల్హర్ రావు/కాటారం
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ శనివారం కాటారం మండలంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించి అధైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.ఈ సందర్భంగా కొత్తపల్లి గ్రామానికి చెందిన బోగిరి ప్రవళిక, పాగే మల్లయ్య అనారోగ్యముతో బాధపడుతుండగా,కోట రాజయ్య మృతి చెందగా కుటుంబ సభ్యులను, నస్తుర్పల్లి గ్రామానికి చెందిన మెరిజాల వెంటకయ్య మృతి చెందగా,శంకరంపల్లి గ్రామానికి చెందిన కందికొండ వైష్ణవి మృతి చెందగా కుటుంబ సభ్యులను,పోత శ్రావణ్ కంటి ఆపరేషన్ చేయించుకోగా తదితర బాధిత కుటుంబాలను పరామర్శించి,అధైర్య పడొద్దు అన్నివిధాలా అండగా ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.