కాంగ్రెస్‌ను నమ్మి మోసపోకండి, బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

– ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్‌
నవతెలంగాణ-షాద్‌నగర్‌
కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవద్దని, బీఆర్‌ఎస్‌ అంటేనే అభివృద్ధి అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్‌ అన్నారు. శనివారం ఫరూఖ్‌ నగర్‌ మండల పరిధిలోని కొండన్నగూడా, మెల్లగుడా, కొంగ గుడా, బూచిగుడా గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. కొండన్నగూడా గ్రామంలో ఇంద్రనగర్‌ గ్రామానికి చెందిన పలువురు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండు వాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌తో ప్రజలకు ఒరిగేది ఏమి లేదని,ఆ పార్టీని నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో హామీలు ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ మాయ మాటలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. 60 ఏండ్ల లో జరగని అభివృద్ధిని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదిన్న ఏండ్లలోనే చేసి చూపించామన్నారు. మరోసారి కారుగుర్తుకు ఓటు వేసి బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే స్వర్ణ తెలంగాణగా మారడం ఖాయమన్నారు. పార్టీలో చేరిన వారిలో రాములు, అర్జున్‌, వెంకటయ్య, నరసింహులు, నిసార్‌, బాబు, సర్దార్‌ భీమా, వెంకటయ్య, సీతా రాము లు, నారాయణ, గౌడ్‌ నారాయణ, కృష్ణయ్య, గౌర య్య, కుర్మయ్య, చంద్రయ్య, లక్ష్మయ్య ఉన్నారు.ఈ కార్య క్రమంలో రైతు సంఘం కో-ఆర్డినేటర్‌ వెంకట్‌రెడ్డి, కొండన్నగూడా సర్పంచ్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, పాపయ్య యాదవ్‌, బుచ్చిగూడ మాజీ ఉప సర్పంచ్‌ యాదగిరి గౌడ్‌, సీనియర్‌ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ బెంది శ్రీనివాస్‌ రెడ్డి, సుష్మా రెడ్డి, అన్నా రం సర్పంచ్‌ రాములుగౌడ్‌ పాల్గొన్నారు.