అసత్య ప్రచారాలను నమ్మి మోసపోకండి

నవతెలంగాణ-చెన్నారావుపేట
బీఆర్‌ఎస్‌ అసత్య ప్రచారాలు నమ్మి మోసపోకుండా చూడ డంతో పాటు ఏవిధంగా మోసం చేస్తుందో కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలని మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్‌ అన్నారు. శని వారం సాయంత్రం మండల కేంద్రంలో తిమ్మరాయని పహాడ్‌, పాపయ్య పేట గ్రామాలలో నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి మాధవరెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ముఖ్య అతిథి పాల్గొని మాట్లాడారు. మూడోసారి అధికారం కోసం టిఆర్‌ఎస్‌ మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలు చేస్తుందన్నారు. కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు విషయాన్ని తెలియజేయాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేసే విధంగా కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు.. కార్యకర్తలు కష్టపడి పని చేస్తూ పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు భూక్య గోపాల్‌ నాయక్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి మొగిలి వెంకటరెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్‌, ప్రధాన కార్యదర్శి మంచాల సదయ్య, ఉపాధ్యక్షుడు నన్నే బోయిన రమేష్‌ యాదవ్‌, సర్పంచ్‌లు సిద్ధన రమేష్‌, తప్పెట రమేష్‌, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.