– పార్టీలకతీతంగా అందరికి సంక్షేమ పథకాలు
– పలు గ్రామాల్లో శంకుస్థాపనలు,ప్రారంబాలు
– ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి..
నవతెలంగాణ – మదనాపురం
గ్యారంటీ లేని కాంగ్రెస్ వాళ్ళ మాటలను నమ్మి మోసపోవద్దని దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.మండలంలోని అజ్జకొలు గ్రామంలో సబ్ స్టేషన్ ఏర్పాటుకు భూమి పూజ చేసి దంతనూర్,గోవిందహళ్లి, కొత్తపల్లి ,నెల్విడి,కొన్నుర్,ద్వారకనగరం, తదితర గ్రామాల్లో పలు అబివద్ధి పనులకు శనివారం నాడు శంకుస్థాపనలు చేసి ప్రారంబించి గ్రామాల యువతకు స్పోర్ట్స్ కిట్లు పంపిణి చేశారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంలో సిఎం కేసీఆర్ సారథ్యంలోనే పార్టీలకతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయన్నారు. అధికారం ఉన్న రాష్ట్రాల్లో అభివద్ది చేయవు కానీ ఆదర్శంతో సంక్షేమ రాష్ట్రమైన తెలంగాణలో పనికిమాలిన గ్యారంటీలతో కాంగ్రెస్ పాలన చేయాలని వెర్రి వేషాలు వేస్తుందన్నారు.రైతులు,మహిళలకు, వద్దులకు,పెళ్ళింటీలకు, పథకాలు అమలు పరుస్తూ కేసీఆర్ ప్రజల గుండెల్లో నిలిచారని వెల్లడించారు.అలాంటి నాయకుడి వల్లే రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగుతుందన్నారు. ఆయా గ్రామాల్లోని మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణి చేసి లబ్ధిదారులకు సిఎంఆర్‌ఎఫ్ చెక్కలు, కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.నెల్విడిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించి పూజలు చేపట్టారు. అనంతరం కానిస్టేబుల్‌గా ఎంపికైన అభ్యర్థులను ఘనంగా సత్కరించి అభినందించారు.కార్యక్రమంలో ఎంపీపీ జన్ను పద్మావతి వెంకట్ నారాయణ,జడ్పిటిసి కష్ణయ్య యాదవ్,వైస్ ఎంపిపి యాదమ్మ గోపాల్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యులు చాంద్ పాషా, సర్పంచులు రామ్ నారాయణ, వాకిట బ్రహ్మామ్మ సత్యం, శ్రావణి,శ్రీనివాసులు, అరుణరమేష్,కోట్ల రాములమ్మ తిరుపతయ్య, జగన్,అనిత శేఖర్,ఎంపిటిసిలు కావలి రాములు,కురుమన్న,శరత్ రెడ్డి,బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు యాదగిరి,జిల్లా రైతు బందు సభ్యులు రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గోపిస్వామి,వాసిరెడ్డి,ప్రవీణ్ రెడ్డి, నాగన్న యాదవ్, రమేష్ తదతరులు పాల్గొన్నారు.