నూతన రేషన్‌ కార్డుల జారీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు

– మంత్రి గంగుల కమలాకర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నూతన రేషన్‌ కార్డుల జారీపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియపై తప్పుడు సమాచారం వస్తున్నదని తెలిపారు. గత కొన్ని రోజులుగా వివిధ సామాజిక మాధ్యమాలు, ఇతర ప్రచారాల్లో రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ మొదలైందని వస్తున్న అసత్య ప్రచారాల్ని ఎవరూ నమ్మొద్దని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల్ని అయోమయానికి గురిచేసేలా ఈ ప్రకటనలను ఎవరు ప్రచారంలోనికి తీసుకురావద్దని పేర్కొన్నారు.