విద్యార్థులపై భారాన్ని మోపొద్దు..

– రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసి హాస్టల్ డిపాజిట్లను తగ్గించాలి..

– ఎస్ ఎఫ్ ఐ, ఎంఎస్ఎఫ్..
నవతెలంగాణ- డిచ్ పల్లి: విద్యార్థులపై భారాన్ని మోపొద్దని, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసి హాస్టల్ డిపాజిట్లను తగ్గించాలని ఎస్ ఎఫ్ ఐ, ఎంఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ బుధవారం తెలంగాణ యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ మహేందర్ రెడ్డి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎస్ఎఫ్ఐ- ఎమ్మెస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ ఒకేసారి హాస్టల్ విద్యార్థుల పైన డిపాజిట్లను పెంచడం వల్ల విద్యార్థులు హాస్టల్, విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాంతోపాటుగా తెలంగాణ యూనివర్సిటీ లో చదువుకునే విద్యార్థులంతా ఎస్సీ, ఎస్టి,బీసీ, మైనారిటీ విద్యార్థులే  అధిక శాతం ఉన్నారని వారన్నారు. ఇష్టానుసారంగా హాస్టల్ డిపాజిట్లను పెంచడం తగదని, ఈ సంవత్సరంలో ఓసి నాన్స్ స్కాలర్షిప్ హోల్డర్స్ విద్యార్థులపై (12000 నుండి 18000) పెంచడం బాధాకరమని దాంతో పాటుగా ఎస్సీ, ఎస్టీ బిసి ల కు సమానంగా పదివేలకు పెంచి రూల్ ఆఫ్ రిజర్వేషన్ నీ తుంగలో తొక్కారని పేర్కొన్నారు. గతంలో ఏ విధంగా హాస్టల్ డిపాజిట్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా డిపాజిట్ల విషయంలో పునరాలోచించాలని కోరారు. దీనికి  చీఫ్ వార్డెన్ సానుకూలంగా స్పందించి విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ ఎమ్మెస్ఎఫ్ అధ్యక్షులు దినేష్, ఉపాధ్యక్షులు వెంకట్ రమణ, ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు దినేష్, సహాయ కార్యదర్శి చరణ్ తదితరులు పాల్గొన్నారు.