నవతెలంగాణ – శాయంపేట
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం వాటిల్లుతుందని, మద్యం సేవించి వాహనాలను నడపవద్దని ఎస్సై సిహెచ్. ప్రమోద్ కుమార్ అన్నారు. పరకాల హనుమకొండ ప్రధాన రహదారిలోని మాందారిపేట స్టేజి వద్ద శుక్రవారం రాత్రి ఎస్సై ప్రమోద్ కుమార్ వాహన తనిఖీలు చేపట్టారు. బ్రీత్ అనలైజర్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వాహనదారులు విధిగా వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ పత్రాలు కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనదారులు మితిమీరిన వేగంతో వెళ్ళవద్దని, అతివేగంతో ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందన్నారు. మద్యం మత్తులోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయన్నారు. ఈ తనిఖీలలో ఏఎస్ఐ కుమారస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.