హామీలు అమలులో విఫలమైన బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీజేపీ నేత గజ్జల యోగానంద్ 51వ రోజుకు చేరిన ప్రజా సమస్యలపై పాదయాత్ర
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇస్తామని హామీలిచ్చి, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని బీజేపీ నేత యోగానంద్ అన్నారు. ప్రజా సమస్యలపై చేపట్టిన పాదయాత్ర శుక్రవారం 51వ రోజుకు చేరుకుంది. లింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనీలో డివిజన్ నాయకులు రాజుశెట్టి కురుమ, డివిజన్ ఓబీసి మోర్చ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్‌చార్జి ఇరుమళ్ల ఎల్లేష్ కుర్మ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా యోగానంద్ మాట్లాడుతూ స్థానిక పాపిరెడ్డి కాలనీ డివిజన్‌లో ప్రజలు సమస్యలతో సతమతమ వుతు న్నారని తెలిపారు. గోపినగర్ చెరువు ప్రమాదకరంగా మారిందనీ, ఆ చెరువు నుంచి వచ్చే దుర్వాస, దోమలతో ప్రజలు అనారోగ్యానికి గురువుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కాలనీలో నాలుగు వీధుల్లో కనీస విద్యుత్ దీపాలు లేవని, సాయంత్రం 6 దాటితే ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. ఆ చెరువులోనుంచి విషపూరితమైన పాములు, పురుగులు రావడంతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురువు తున్నాయన్నారు. ప్రజలకు అవసరమైన వైద్యశాల, పిల్లలు ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్స్, పార్కులు కానీ, ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి కాంచన కృష్ణ, జిల్లా నాయకులు చిన్నం సత్యనారాయణ, శేరిలింగంపల్లి డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్య కురుమ, ఆల్విన్ కాలనీ డివిజన్ ప్రధాన కార్యదర్శి తప్పా రఘు, శేరిలింగంపల్లి డివిజన్ ఉపాధ్యక్షులు బాలరాజు, మియాపూర్ డివిజన్ ఉపాధ్యక్షులు రత్న కుమార్, మియాపూర్ డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు సిద్దు, శేరిలింగంపల్లి డివిజన్ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కిరణ్, బీజేవైఎం నాయకులు రామకృష్ణ, మహిళ మోర్చ నాయకులు గాయత్రి, కల్పనదేవి, నివేదిత చందా, ఎస్ జ్యోతి, లలిత, భార్గవ్‌రామ్, మురళి, వి.రమేష్, ఎ.కల్యాణ్, వెంకటేష్, శివచారీ, ఫిరోజ్, రాములు, స్థానికులు పాల్గొన్నారు.