

గత ఐదు రోజులుగా లారీ యజమానులు తమ పొట్టకూటి కోసం కడుపు మాడుచుకుని సమ్మె చేస్తున్న రైస్ మిల్ యజమానులు కనికరించడం లేదని లారీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుమంచిరెడ్డి రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం రాజేందర్ రెడ్డి సమ్మె చేస్తున్న లారీ యజమానులకు సమ్మె శిబిరం వద్ద మద్దతు తెలిపారు.సుల్తానాబాద్ మండల కేంద్రంలో దాదాపుగా 120 పైగా రైస్ మిల్లులు ఉన్నాయి. వీటిపై ఆధారపడి జీవనం కొనసాగించవచ్చు అని తాము సొంత ఉపాధి కల్పించుకునే విధంగా కొంతమంది ఫైనాన్స్ లో లక్షలు వెచ్చించి లారీలను కొనుగోలు చేసుకుంటే నూతనంగా ఏర్పడిన మిల్లర్ల లారీ అసోసియేషన్ తో రైస్ మిల్లర్లు తమ పొట్ట కొడుతున్నారని లారీ అసోసియేషన్ సభ్యులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సుల్తానాబాద్ లోని రైస్ మిల్ అసోసియేషన్ ముందు గత ఐదు రోజులుగా సమ్మె చేస్తూ కడుపులు మాడుచు కుంటున్న రైస్ మిల్లర్లు కనికరించడం లేదని రైస్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంచి రెడ్డి రాజేందర్ రెడ్డి అన్నారు. గత కొన్ని ఏళ్లుగా స్థానిక లారీలను వాడుకొని ప్రస్తుతం నూతన రైస్ మిల్లర్ల లారీ అసోసియేషన్ ఏర్పాటు చేయడంవిడ్డూరంగా ఉంది అని అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన లారీలతో ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ స్థానిక లారీ యజమానుల పొట్టగొడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సమ్మెను ఉధృతం చేసి ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న లారీలను అడ్డుకుంటామని అన్నారు. రైస్ మిల్లర్ల వికృత చేష్టలకు దాదాపు 500 మంది ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.ఆనాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేపట్టిన తెలంగాణ ఉద్యమంలో సైతం మేము చురుగ్గా పాల్గొని ఆర్థికంగా నష్టపోయామని, అలాంటి మా పొట్ట కొట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ, మా జీవనోపాధిని సుల్తానాబాద్ రైస్ మిల్ యజమానులు దెబ్బతీస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రతిపక్ష నాయకులందరూ మా లారీ అసోసియేషన్ కి మద్దతు తెలిపి,మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. ఇప్పటికైనా సుల్తానాబాద్ రైస్మిల్ యాజమాన్యం స్థానిక లారీలను రవాణా కోసం వాడాలని, లేనిపక్షంలో రాష్ట్ర స్థాయిలో సైతం పెద్ద మొత్తంలో ఉద్యమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కోయ్యాడ సుధాకర్ గౌడ్, మంచిర్యాల లారీ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి ఫయాజ్, సుల్తానాబాద్ లారీ అసోసియేషన్ అధ్యక్షులు తిరుపతి, రౌతు రవి, నాగరాజు, శేఖర్, రాజిరెడ్డి, సతీష్, శివ, కుమార్, వినోద్, హకీం, మరియు తదితరులు పాల్గొన్నారు.