సోషల్‌ మీడియా ఎమ్మెల్యేను నమ్మవద్దు : కుడుముల లక్ష్మీనారాయణ

నవతెలంగాణ-మంగపేట
నియోజకవర్గ అభివద్ధిని ప్రజా సేవను పక్కన పెట్టి సోషల్‌ మీడియా సేవలో నిమగమయ్యే ఎమ్మెల్యే సీతక్కను ప్రజలు నమ్మవ ద్దని బీఆర్‌ఎస్‌ మండలశాఖ అధ్యక్షుడు కుడుముల లక్ష్మీ నారాయణ అన్నారు. ఆదివారం కుడుముల లక్ష్మీనారాయణ నివాసంలో ఏర్పా టుచేసిన బీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మా ట్లాడారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రాంత ప్రజల కు ఒరగబెట్టింది ఏమిలేదని విమర్శించారు. మరోసారి నియోజ కవ ర్గ ప్రజలను మోసం చేయడానికి సిద్దమవుతున్న సీతక్కను ప్రజలు ఓడిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ములుగు నియోజకవర్గ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేని సీతక్కకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల గురించి ఎలా తెలుస్తుందని ఎద్దేవ చేశారు. ముఖ్య మంత్రి ములుగును జిల్లాగా చేశారని, జిల్లాకు మెడికల్‌ కాలేజీతో పాటు ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్‌, ఫైర్‌ స్టేషన్‌, మంజూరు చేశారని అన్నారు. మంగపేట మండలనీకి బస్‌ స్టాండ్‌ కోరకు 50 లక్షల రూపాయిలు మంజూరు చేసి అభివద్ధికి గీటు రాయిగా గుర్తిం పు పొందారన్నారు. ములుగు జిల్లాకు చెందిన సుమారు పదిహేడు వేల గిరిజన కుటుంబలకు పోడు భూములకు పట్టాలి ఇచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని తెలిపారు. జిల్లా లోని 57గిరిజన గుడా లను తండాలను గ్రామపంచాయతీలుగా మార్చారని వెల్లడించారు. డబ్బుల సంచులతో బీఆర్‌ఎస్‌ నాయకులు వస్తున్నారని విమర్శిస్తు న్నారని, చత్తీస్గడ్‌ రాష్ట్రంలో కోట్ల రూపాయల కాంట్రాక్టులు, ములు గు నియోజకవర్గంలో భూకబ్జా ఆరోపణలు ఉన్నాయో గమనించు కోవాలన్నారు. కాంగ్రెస్‌కు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్‌, పిఏసిఎస్‌ డైరెక్టర్‌ నర్రా శ్రీధర్‌, బోర్‌ నర్సాపూర్‌ గ్రామ కమిటీ అధ్యక్షులు రావుల రమణ ,మండల నాయకులు, చిట్టీమల్ల సమ్మయ్య, యర్రంశెట్టి రామకష్ణ, బుట్టో, ముగల రమేష్‌, యూత్‌ నాయకులు, ముగల రాము, లంజపెల్లి సారయ్య, చిట్యాల నరేష్‌, సాధనపల్లి రవి,గాదెర్ల నర్సింహారావు, వల్లపోగుల వినోద్‌, నరేందర్‌, ఆదినారాయణ, శ్రవణ్‌ కుమార్‌, శ్రీనాద్‌, మండల సోషల్‌ మీడియా ఇన్‌చార్జి గుడివాడ శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.