పైపై మెరుగులు వద్దు మెరుగైన పాలనే ముద్దు : నోముల

నవతెలంగాణ-ఓయూ:
తెలంగాణ వ్యాప్తంగా ”దశాబ్ది దగా” పేరుతో కాంగ్రెస్‌ పార్టీ ధర్నాలు చేపడుతున్న వేళా దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది దానిలో భాగంగా 10 అంశాలతో కూడిన 10 దిష్టిబొమ్మలను దహనం చేయా లని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపుమేరకు అంజన్‌కుమార్‌, అనిల్‌ కుమార్‌ సారధ్యంలో సికిం ద్రాబాద్‌ నియోజకవర్గం సీతాఫల్మండి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు నోముల ప్రకాష్‌ రావు ఆదేశాల మేరకు సీతాఫల్మండి చౌరస్తాలో సీఎం కేసీఆర్‌ దిష్టి బొమ్మని దహనం చేశారు. పైపై మెరుగులు వద్దు మె రుగైన పాలనే ముద్దు కెసిఆర్‌ డౌన్‌ డౌన్‌ అనే నినా దాలు చేశారు. పలువురు కాంగ్రెస్‌ నేతలను అరెస్టు చేసి చిలకలగూడ పోలీ స్టేషన్‌ కు తరలించారు. జిల్లా అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌లో పార్టీ శ్రేణులను ప్రమర్శించి శాంతియుతంగా చేస్తున్న ధర్నాలో అరెస్టు చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గు ,సురేష్‌ లాల్‌ యూత్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ కిషోర్‌ యాదవ్‌ ఎం ఆర్‌ శ్రీనివాస్‌, అరుణ్‌ కుమార్‌ అభిషేక్‌ ,వేణు గౌడ్‌ యాది పాల్గొన్నారు.